నా నవలలు

ఆనుబంధాలు-ఆవేశాలు

ఈ నవల హత్యలు చేసి కారాగారంలో ఉన్న ఇద్దరు యువతుల కథ. భ్రమర అనే యువతి తల్లిని హత్య చేసింది. అంజమ్మ అనే పల్లె యువతి, ప్రమాదవశాత్తు ఆమె స్నేహితురాలిని హత్య చేసింది.

నియతి అనే మనస్తత్వశాస్త్రం చదివిన యువతి వీరిద్దరు ఈ హత్యలు చేయటానికి కారణం తెలుసుకుని, వారికేమైనా తాను సహాయం చేయగలనేమో అనే ఉద్దేస్యంతో వీరిని కారాగారంలో కలుసుకుంటుంది.

అనురాగ సంగమం

నా మొదటి నవల చదివిన పాఠకులు ఇచ్చిన సహకారంతో రెండవ నవల వ్రాయటానిక ధైర్యం చేసాను. ప్రముఖ రచయితలు, మందపాటి సత్యంగారు, టేకుమళ్ళ వెంకటప్పయ్యగారు తమ అభిప్రాయాలు తెలిపారు.

ఒక మూగ యువతి, అనేక గర్భస్రావాలు జరిగిన తరువాత, డాక్టర్స్, ఆమెకు గర్భసంచి దెబ్బతిన్నదని, పిల్లలు కలగటం చాలా కష్టమని నిర్ధారణ చేసారు. నిరాసతో కృంగిపోతున్న యువతి నదిలో కొట్టుకు పోతున్న ఉయ్యాలలో పాపను చూసి, ఆపాపను భగవంతుని వరంగా భావించి స్వంత కూతురిలా పెంచుకోసాగింది. కాని ఆమె భర్త మాత్రం ఈ పాప కోసం తలి దండ్రులు ఎంత పరితపిస్తున్నారో అని ఆలోచిస్తుంటాడు.

తరువాత ఏం జరిగిందో నవల చదివి తెలుసుకోవాలి.